- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే రోజు ఆరు సాధారణ కాన్పులు
మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ జి. చంద్రకళ నేతృత్వంలో ఒకే రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆరు సాధారణ కాన్పులను చేశారు.

దిశ, అయిజ : మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ జి. చంద్రకళ నేతృత్వంలో ఒకే రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆరు సాధారణ కాన్పులను చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీఎంహెచ్ఓ, మెడికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ఆదేశానుసారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి గర్భిణీ స్త్రీలకు 99 శాతం నార్మల్ డెలివరీలు చేయాలని సూచించారు. మిగిలిన 1% జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల సలహాలు, సూచనల మేరకే సాధారణ కాన్పులు చేయడం సాధ్యమైందన్నారు. ఈ విషయమై ప్రాధమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, సిబ్బంది ఆమెను అభినందించారు. ఈ విషయం డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నార్మల్ డెలివరీలు మా సిబ్బంది చేస్తున్నారు. జిల్లాలోనే ఎన్నోసార్లు ముందుండి అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు.






