ద్వారకా దేవాలయం వద్ద గాయపడ్డ సీతా దయాకర్ రెడ్డి!

by Kodari Anjali |

మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి ద్వారకా దేవాలయ దర్శనానికి వెళ్లే సమయంలో మెట్లు ఎక్కుతూ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు టాక్.

ద్వారకా దేవాలయం వద్ద గాయపడ్డ సీతా దయాకర్ రెడ్డి!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి గత శనివారం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా దేవాలయ దర్శనానికి వెళ్లే సమయంలో మెట్లు ఎక్కుతూ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత అధికారులు ఆమెను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపారు. గచ్చిబౌలిలోని ఏజీఎం హాస్పిటల్‌లో ఆపరేషన్‌తో పాటు, వైద్య సేవలు నిర్వహించడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. సీతా దయాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వారి అభిమానులు కోరుతున్నారు.

Next Story