- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ కు సిట్ నోటీస్.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జి దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.

దిశ, మక్తల్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జి దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి నారాయణపేట రోడ్డు వరకు ప్లకార్డులు, నల్లజెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.మున్సిపల్ ఎన్నికల నియామవళి అమలులో ఉండటంతో ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనాలు పోలీస్ అధికారుల పర్మిషన్ తో చేయాలని మక్తల్ మున్సిపల్ పరిశీలించేందుకు విచ్చేసిన ఎస్పీ వినీత్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నియమాలు రాజకీయ కారణాలతో ఇతర విషయాలను అడ్డుపెట్టుకొని ర్యాలీలు, ధర్నాలు చేసే వారి పట్ల చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ చెప్పిన అరగంటకే సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడం తగదని.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.






