- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నాయకుడికి షోకాజ్ నోటీసులు
ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ నాయకుడు డబ్బులు వసూళ్ళు అనే శీర్షికతో సోమవారం ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన కథనం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో స్పందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి మంగళవారం సదరు నాయకుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కాంగ్రెస్ నాయకుడికి షోకాజ్ నోటీసులు
-24 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలి
-ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదు
-యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్ కుమార్
దిశ నాగర్ కర్నూల్ : ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ నాయకుడు డబ్బులు వసూళ్ళు అనే శీర్షికతో సోమవారం ‘దిశ’ దినపత్రికలో ప్రచురితమైన కథనం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో స్పందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి మంగళవారం సదరు నాయకుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసు అందిన 24 గంటల్లోపు మీపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు ఎవరైనా సంక్షేమ పథకాల్లో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు. మరో వైపు తాడూరు పోలీస్ స్టేషన్లో బాధితురాలు భీమమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకుడు చిక్కొండ్ర మల్లేష్ పై కేసు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం.






