- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతిరహిత సేవలందించాలి : టీఎస్ యూటీఎఫ్
జిల్లా విద్యాశాఖ అధికారిగా అవినీతి రహిత సేవలు అందించి, పారదర్శక పాలన చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేష్ లు కోరారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా విద్యాశాఖ అధికారిగా అవినీతి రహిత సేవలు అందించి, పారదర్శక పాలన చేయాలని టీఎస్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేష్ లు కోరారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లాకు నూతనంగా నియమితులైన డీఈఓ విజయకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి బోకె, యూటీఎఫ్ డైరీ, 'వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్' మాసపత్రిక ను వారు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలని, జిల్లా విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా జిల్లా విద్యా శాఖ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కలిసి పని చేద్దామని, అలాగే విద్యారంగ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక సహకారాన్ని అందజేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్. కిష్టయ్య, నర్సింహులు, భాస్కర్, హేమంత్ కుమార్, అజయ్, శ్రీనివాస్, ఖాదరయ్య, జయంతి, కిస్టియ నాయక్, శివరాజ్ పాల్గొన్నారు.






