- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే షాపులు సీజ్
జిల్లాలో వైద్యం, విద్య పై ప్రత్యేక దృష్టి సారించినట్టు నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.

దిశ, నాగర్ కర్నూల్ : జిల్లాలో వైద్యం, విద్య పై ప్రత్యేక దృష్టి సారించినట్టు నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, పక్కనబెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యం గా భావించి పనిచేసే నిజమైన వ్యక్తులు జర్నలిస్టులని అన్నారు. జిల్లాలో గత సంవత్సరం విద్య, వైద్యం, ప్రత్యేక దృష్టి సారించడంతో నేడు రాష్ట్ర స్థాయిలో విద్య, వైద్యంపై మంచి గుర్తింపు వచ్చిందని, ఈ సంవత్సరం కూడా విద్య, వైద్యంతో, పాటు అంగన్ వాడీ, మహిళా అభ్యున్నతి, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, రైతులను, ఆయిల్ ఫామ్ పంటల సాగును, అవగాహన జిల్లాలో పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు 385 ప్రాంతాలను యూనిట్లుగా విభజించి ప్రతిరోజు 4000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించేలా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుందని, జిల్లాలో ఎక్కడైనా రైతులకు యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించిన, రైతులకు ఇతర సరుకులు క్రిమిసంహారక మందులు కొనాలని డిమాండ్ చేసిన షాపులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి 60 శాతం నిర్మాణ పనులను కూడా పూర్తి చేయడం జరిగిందని, చెంచుపెంటలోని చెంచులకు 1100 ఇండ్లను మంజూరు చేసామని చెప్పారు.






