జ‌డ్చ‌ర్ల లో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన‌ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల త్రిపుర సుంద‌రి

by Ratna Kumari |

జ‌డ్చ‌ర్ల‌లో బీజేపీకి షాక్ త‌గిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాల త్రిపుర సుందరి పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.

జ‌డ్చ‌ర్ల లో బీజేపీకి షాక్..  రాజీనామా చేసిన‌ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల త్రిపుర సుంద‌రి
X

దిశ, జడ్చర్ల : జ‌డ్చ‌ర్ల‌లో బీజేపీకి షాక్ త‌గిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాల త్రిపుర సుందరి పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది. ఆ పార్టీ పరిస్థితి బాల త్రిపుర సుందరి రాజీనామాకు ప్రధాన కారణం బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో తనకు దూరంగా అవమానం జరిగిందని జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఒకే ఒక్క బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా త‌న‌ను వేదిక పైకి పిలిచారు. ఇటీవల పార్టీలో చేరినప్ప‌టికీ ఎలాంటి పదవులు లేని వారికి వేదికపై పిలవడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. బాలా త్రిపుర సుందరి రాజీనామాతో జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ మరింత బలహీన పడినట్టు అయింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళ‌న‌లో పడ్డారు. బాల త్రిపుర సుందరి గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Next Story