- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెరిసిన రెయిన్ బో విద్యార్థులు..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెయిన్ బో పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలలో అద్భుత ఫలితాలను సాధించారు.

X
దిశ, పాలమూరు: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెయిన్ బో పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలలో అద్భుత ఫలితాలను సాధించారు. పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన విద్యార్థులు అందరూ అత్యుత్తమ మార్కులతో 100% ఉత్తీర్ణతను సాధించారు. మహమ్మద్ హుస్సేన్ 600 మార్కులకు గాను 575, సామ్యూల్ పిక్చర్ 572, మెహరీన్ ఫాతిమా 571, కుందన ప్రియ 570 మార్కులు సాధించారు. 60 శాతం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ మమత, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ ప్రత్యేకంగా అభినందించారు.
Next Story






