బీసీ రిజర్వేషన్ పై బీఆర్ఎస్, బీజేపీ వైఖ‌రి చెప్పాలి : షేక్ ముబారక్

by Nallavelli.Anjaneyulu |

దిశ, తిమ్మాజీపేట : రాష్ట్ర ప్ర‌భుత్వం కుల‌గ‌ణ‌న చేప‌ట్టి 42 శాతం రిజ‌ర్వేష‌న్ తీసుకొచ్చింద‌ని.. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల వైఖ‌రీ ఏమిటో చెప్పాల‌ని కాంగ్రెస్ మైనార్టీ జిల్లా నాయ‌కులు

బీసీ రిజర్వేషన్ పై బీఆర్ఎస్, బీజేపీ వైఖ‌రి చెప్పాలి : షేక్ ముబారక్
X

దిశ, తిమ్మాజీపేట : రాష్ట్ర ప్ర‌భుత్వం కుల‌గ‌ణ‌న చేప‌ట్టి 42 శాతం రిజ‌ర్వేష‌న్ తీసుకొచ్చింద‌ని.. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల వైఖ‌రీ ఏమిటో చెప్పాల‌ని కాంగ్రెస్ మైనార్టీ జిల్లా నాయ‌కులు షేక్ ముబార‌క్ పేర్కొన్నారు. శుక్ర‌వారం ఆయ‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండ‌ల కేంద్రంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం తో డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ నిద్ర పోయిందని ప్రశ్నించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని విమర్శించారు. కనీసం ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పాల‌న‌లో పదేళ్ల పాలనలో చేయనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇది చరిత్రలో నిలిచే నిర్ణయమని ఇది కేవలం రిజర్వేషన్ కాదు.. ఇది బడుగు బలహీన వర్గాల నిజమైన స్వతంత్ర దినం అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి ప‌నుల‌ను చూసి ఓర్వ‌లేక‌నే కాంగ్రెస్ పై లేనిపోని మాట‌లు మాట్లాడుతున్నార‌ని.. బీఆర్ఎస్, బీజేపీ నాట‌కాలు ఆడుతున్నాయ‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు.

Next Story