- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాన్ని అడ్డుకున్న షీ టీమ్స్
by Naveena |
బాల్య వివాహాన్ని షీ టీం అధికారులు అడ్డుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని ఓ గ్రామంలో గురువారం వెలుగు చూసింది.

X
దిశ నాగర్ కర్నూల్/బిజినపల్లి: బాల్య వివాహాన్ని షీ టీం అధికారులు అడ్డుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని ఓ గ్రామంలో గురువారం వెలుగు చూసింది. షీ టీం మెంబెర్ వెంకటయ్య తెలిపిన వివరాలు ప్రకారం.. బిజినపల్లి మండలంలోని ఒక గ్రామంలో బాల్యవివహాము జరుగుతుందని సమాచారం వచ్చింది. షీ టీం తక్షణమే స్పందించి చైల్డ్ లైన్ సభ్యులు మధు, కవితతో కలిసి బాల్యవివహాన్ని ఆపడం జరిగిందన్నారు. బాల్య వివాహం చేయడం నేరం, ఇందులో వివాహానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయి అని హెచ్చరించారు. జిల్లాలో బాల్యవివహాలు ఎక్కడ జరిగిన సమాచారం వచ్చిన వెంటనే చైల్డ్ లైన్ తో పాటు షీ టీం కూడా అందుబాటులో ఉందన్నారు. బాల్యవివహాము ను ఆపుటకు వెంటనే కాల్ చేయాల్సిన నంబర్స్ 8712657676,1098 కాల్ చేయమని సూచించారు.
Next Story






