SGF అండ‌ర్-17 రాష్ట్ర స్థాయి క్రికెట్ విజేత మ‌హ‌బూబ్ న‌గ‌ర్

by Nallavelli.Anjaneyulu |

రాష్ట్ర స్థాయి SGF అండర్ 17 బాలుర క్రికెట్ టోర్నమెంట్ విజేతగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జట్టు ఖమ్మం జట్టుతో జరిగిన హోరాహోరీ పోరులో నాలుగు పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.

SGF అండ‌ర్-17 రాష్ట్ర స్థాయి క్రికెట్ విజేత మ‌హ‌బూబ్ న‌గ‌ర్
X

దిశ, జడ్చర్ల : రాష్ట్ర స్థాయి SGF అండర్ 17 బాలుర క్రికెట్ టోర్నమెంట్ విజేతగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జట్టు ఖమ్మం జట్టుతో జరిగిన హోరాహోరీ పోరులో నాలుగు పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. గత మూడు రోజులుగా జడ్చర్ల పట్టణంలోని వ్యక్తుల మినీ స్టేడియం స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ పాఠశాల జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ బాదేపల్లి పాఠశాల గ్రౌండ్ లో ఈ క్రీడా పోటీలను నిర్వహించారు. గత మూడు రోజులుగా ఉత్సాహంగా జరిగిన క్రికెట్ పోటీల్లో సోమవారం సెమీఫైనల్స్ ఫైనల్స్ నిర్వహించగా.. ఫైనల్ మ్యాచ్ జడ్చర్ల మినీ స్టేడియంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్- ఖమ్మం జట్ల మధ్య జరిగింది.

ఈ మ్యాచ్ లో తొలుత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జ‌ట్టు 15 ఓవ‌ర్ల‌లో 110/5 ప‌రుగులు చేసింది. రామ్ చారి 31, కేతాన్ 30 ప‌రుగులు చేశారు. నాయక్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ త‌రువాత 111 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఖ‌మ్మం జ‌ట్టు 107/5 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. 4 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. మాన్విత్ 30, సులేమాన్ 29 ప‌రుగులు చేశారు. వ‌రుణ్ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎంఓ దూకుడు శ్రీనివాసులు బాదేప‌ల్లి మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ జ్యోతి మండ‌ల ఎంఈవో మంజుల దేవి, కౌన్సిల‌ర్ స‌తీష్ కుమార్ విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. కార్యక్రమంలో నాయకులు కాల్వ రామ్ రెడ్డి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శారదాబాయి పిడి రాములు, పిడి మోయిన్ పాల్గొన్నారు.

Next Story