విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం ఆగదు : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయ‌కులు న‌ర‌హ‌రి

by Ratna Kumari |

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం ఆగదు అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయ‌కులు న‌ర‌హ‌రి పేర్కొన్నారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ  పోరాటం ఆగదు : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయ‌కులు న‌ర‌హ‌రి
X

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం ఆగదు అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయ‌కులు న‌ర‌హ‌రి పేర్కొన్నారు. నారాయ‌ణ జిల్లా కేంద్రంలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ముందు ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. ఎస్ఎఫ్ఐ 1970 కేర‌ళ‌లోని త్రివేంద్ర న‌గ‌రంలో స్వాతంత్య్రం, ప్ర‌జాస్వామ్యం, సోష‌లిజం ల‌క్ష్యాల‌తో అధ్య‌య‌నం పోరాటం నినాదంతో డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో 8 మంది తోటి ఏర్పడి నేడు దేశంలోనే 30 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించింది. దేశంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నాణ్యమైన, శాస్త్రీయమైన ఉచిత విద్య ప్రతి ఒక్కరికి అందాలని ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు.

నేడు దేశంలో పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ విద్యార్థులకు వ్యతిరేకంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చి అశాస్త్రీయమైన , చరిత్రని వక్రీకరించే విద్యను విద్యార్థులకు అందిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా ఒక తాగుబోతులకి మంత్రిని కేటాయిస్తారు తప్ప విద్యాశాఖ కి మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రిని నియమించి, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేసి, సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్, అనిల్, మమత, అశ్వినితో పాటు 50 మంది పాల్గొన్నారు.

Next Story