రైతు వేదిక ముందు పారుతున్న మురుగు నీరు

by Ratna Kumari |

దిశ‌, అడ్డాకుల : మండల కేంద్ర పరిధిలోని అసెంబ్లీ కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో పదిహేను కుటుంబాలకు సంబంధించిన డ్రైనేజీ మురికి నీళ్లు గత కొద్ది రోజుల నుండి రైతు వేదిక రోడ్డు పై ప్రవహిస్తున్నాయి.

రైతు వేదిక ముందు పారుతున్న మురుగు నీరు
X

దిశ‌, అడ్డాకుల : మండల కేంద్ర పరిధిలోని అసెంబ్లీ కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో పదిహేను కుటుంబాలకు సంబంధించిన డ్రైనేజీ మురికి నీళ్లు గత కొద్ది రోజుల నుండి రైతు వేదిక రోడ్డు పై ప్రవహిస్తున్నాయి. అంతకు ముందు ఎన్ హెచ్ 44 సర్వీస్ రోడ్ వరకు ఉన్న డ్రైనేజీ ధ్వంసం కావడంతో, మురుగునీరు రైతు వేదిక రోడ్డు పై ప్రవహిస్తోంది. దీంతో దోమల వల్ల రోగాల బారిన పడుతున్నామని గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి ఎన్నిసార్లు ఈ సమస్యను తీసుకువెళ్లిన కూడా స్పందించడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ప్రతి నెలలో రెండు మూడుసార్లు రైతు వేదికలో ప్రభుత్వ సంబంధించిన సమావేశాలు జరుగుతాయి. రైతు వేదిక ముందు ఉన్న మురుగునీరుని చూసి రైతులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి డ్రైనేజీ నీ నిర్మించి సమస్యను పరిష్కరించి రోగాల బారిన పడకుండా చూడాలని అధికారులు కాలనీవాసులు కోరుతున్నారు.

Next Story