- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, భూత్పూర్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భూత్పూర్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ మండలం గాజుల పేట గ్రామం విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఏషమోని గోపాల్ కి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం తన సొంత గ్రామం భూత్పూర్ నుంచి విధులకు వెళ్లేందుకు బయలుదేరిన మోటార్ సైకిన్ కలెక్టరేట్ సమీపంలో టిప్పర్ ఢీ కొట్టింది. ఈ సంఘటన గోపాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో భూత్పూర్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న భూత్పూర్ సీఐ రామకృష్ణ వెంటనే తన వాహనంలో ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న గోపాల్ కి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.
Next Story






