జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక

by Nallavelli.Anjaneyulu |

దిశ, కందనూల్ : జార్ఖండ్‌లోని రాంచి జిల్లాలో డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరుగనున్న జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక
X

దిశ, కందనూల్ : జార్ఖండ్‌లోని రాంచి జిల్లాలో డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరుగనున్న జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలకు కు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వి.సీతారాం తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని విద్యార్థినులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జిల్లా క్రీడా రంగానికి ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కల్వకుర్తి మినీ స్టేడియంలో నిర్వహిస్తోన్న ఉచిత ఫుట్‌బాల్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో 17 సంవత్సరాల విభాగంలో పి.అక్షర, 14 సంవత్సరాల విభాగంలో ఎం.వి. ధ్యానాంజలి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. వీరి కృషి, ప్రతిభ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కలెక్టర్ ప్రశంస

జాతీయ స్థాయికి ఎంపికైన ఇద్దరు యువ క్రీడాకారిణులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో అభినందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వి. సీతారాం, డిఎస్ఓ జె.వెంకట రాములు, కోచ్‌లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story