అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, మద్దూరు : అక్ర‌మంగా నిలువ ఉంచిన రేష‌న్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు ప‌ట్టుకున్నారు. సివిల్

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్  బియ్యం పట్టివేత
X

దిశ, మద్దూరు : అక్ర‌మంగా నిలువ ఉంచిన రేష‌న్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు ప‌ట్టుకున్నారు. సివిల్ స‌ప్లై అధికారి ఆనంద్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని ధమగాన్ పూర్ గ్రామంలో బలిజ వీరేష్ తండ్రి బసంతప్ప ఇంట్లో అద్దెకు ఉంటున్న శశిధర్ అనే వ్యక్తి అక్రమంగా 59 సంచుల రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలిసి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా.. 29 క్వింటాళ్ల 40 కేజీల బియ్యం పట్టుబడటంతో ఆ బియ్యాన్ని సీజ్ చేసి నాగిరెడ్డిపల్లి డీలర్ లలిత( షాప్ నంబర్ 4605005) కు అప్పగించి రసీదు పొందామ‌ని తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన, తరలించిన చర్యలు తప్పవని సివిల్ సప్లై అధికారి ఆనంద్ హెచ్చరించారు బియ్యం నిల్వ చేసిన శశిధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Next Story