నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

by Bhanu |

పట్టణంలోని ఒక కిరాణా షాప్‌లో నిషేధిత అంబర్ జర్దా, గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచినట్టు వచ్చిన పక్క సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించారు.

నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
X

దిశ, మక్తల్ : పట్టణంలోని ఒక కిరాణా షాప్‌లో నిషేధిత అంబర్ జర్దా, గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచినట్టు వచ్చిన పక్క సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.31,475 విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసినట్లు మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. పట్టణ కేంద్రంలోని ఆలంపల్లి రంగనాథ్ కిరాణా షాపులో ఈ నిషేధిత గుట్కాను నిల్వ ఉంచి విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసిన ప్యాకెట్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి, షాప్ యజమాని ఆలంపల్లి రంగనాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Next Story