నిషేదిత అల్పాజోలం పట్టివేత.. 26.22 గ్రాములు స్వాధీనం

by Ratna Kumari |

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ : నిషేధిత అల్ప జోలం అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో

నిషేదిత అల్పాజోలం పట్టివేత..  26.22 గ్రాములు స్వాధీనం
X

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ : నిషేధిత అల్ప జోలం అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ శివారులోని గోల్డెన్ కేఫ్ అండ్ దాబా లో నిషా కోసం ఆల్ఫా జోలం తంసప్ లో కలుపుకుని తాగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు నాగర్కర్నూల్ ఎస్సై గోవర్ధన్ వారి సిబ్బందిని అక్కడికి పంపించారు. అనుమానాస్పదంగా ఉన్న నలుగురి వ్యక్తులను( బిన్నపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన వంగ ఆంజనేయులు గౌడ్ , లింగస్వామి పల్లి గ్రామానికి చెందిన గార్లపాటి పురుషోత్తం గౌడ్, తాడూరు మండలం చర్ల తిరుమలపురం గ్రామానికి చెందిన గుల్లొలు సాయిరాం , నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన మైల శివ శంకర్ ) పట్టుకొని చెక్ చేయగా 26.22 గ్రాముల ఆల్ఫా జోలం పట్టుబడింది. వంగ ఆంజనేయులు గౌడ్, పురుషోత్తం గౌడ్ ఇద్దరూ వారి ఊర్లలో కళ్ళు దుకాణం నడుపుతున్నారు. ఆల్ఫా జోలం ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేయగా అలంపూర్ కు చెందిన నర్సన్ గౌడ్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఆల్ఫా జోలం సరఫరా చేసిన నర్సన్ అనే వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు.గుల్లొలు సాయిరాం,మైల శివ శంకర్ గంజాయి అలవాటు ఉండేది. ఇప్పుడు గంజాయి దొరకపోవడంతో తంసప్ లో అల్పా జోల కలుపుకొని తాగుతున్నట్లు ఒప్పుకున్నారు. పంచుల సమక్షంలో రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రెస్ మీట్ లో నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై గోవర్ధన్, కానిస్టేబుల్ భీముడు,శ్రీశైలం, నిరంజన్ ఉన్నారు.

Next Story