- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు విజయానికి తొలిమెట్టు విత్తనమే: శాస్త్రవేత్త కళ్యాణి
దిశ, ఎర్రవల్లి : రైతుల విజయానికి తొలిమెట్టు నాణ్యమైన విత్తనమే అని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కే కళ్యాణి పేర్కొన్నారు. శుక్రవారం

దిశ, ఎర్రవల్లి : రైతుల విజయానికి తొలిమెట్టు నాణ్యమైన విత్తనమే అని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కే కళ్యాణి పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రైతు శివన్న నాయుడు పొలంలో ఆర్ఎన్ఆర్15048 పంట పై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం ద్వారా పంట దిగుబడి, ఆదాయం పెరుగుతాయని తెలిపారు. ఈ విత్తనాన్ని గ్రామంలోని ఇతర రైతులకు ఇవ్వడం వలన వారికి నాణ్యమైన విత్తనం చౌకగా లభిస్తుందన్నారు. రైతులు ఎక్కడో దూరంగా వెళ్లి వేరే మార్కెట్ లో తెలియని రకాలు కొనుగోలు చేయడంకంటే తమ గ్రామంలోని తమ రైతులే పండించిన నాణ్యమైన విత్తనం తీసుకోవడం వలన రైతులకు వ్యయ, ప్రయాసలు తగ్గి సులభంగా విత్తనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎర్రవల్లి మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ మాట్లాడుతూ రైతులకు విత్తన నిల్వ విధానాలపై అవగాహన కల్పించారు. రైతులు తమ అనుభవాలు పంచుకుంటూ నాణ్యమైన విత్తనం తమ గ్రామంలోనే దొరుకుతూ పది మందికి అందుబాటులోకి వచ్చిందని.. ఇందుకు తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నరేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.






