వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళ

by Taduka Kalyani |

వనపర్తి మండలం నాగవరం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కురుమయ్య తెలిపారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో  విత్తన మేళ
X

దిశవనపర్తి రూరల్: వనపర్తి మండలం నాగవరం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి కురుమయ్య తెలిపారు. ఈ విత్తన మేళా జూలై 27 నుంచి 29, 2026 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ఈ విత్తన మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ హైమావతి, మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, నాగవరం సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. విత్తన మేళాలో కంది, మినుము, గోరుచిక్కుడు, పాలకూర, బెండకాయ తదితర పంటల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలను పొందాలని అధికారులు కోరారు.

Next Story