- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రేజీ కాంబో.. ‘అది నా పిల్ల రా’ సినిమాలో తిరువీర్‌కు జోడీగా క్రేజీ హీరోయిన్!
ఇక ఇప్పుడు ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

దిశ, సినిమా: ‘బేబి’ వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్‌తో నేషనల్ అవార్డు అందుకున్న నిర్మాత ఎస్‌కెఎన్, ఇటీవలే వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ యూత్‌ను అలరించడంతో పాటు భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ‘అది నా పిల్ల రా’ అనే మాస్ అండ్ క్యాచీ టైటిల్‌తో ఒక ఇంటెన్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా ద్వారా కృష్ణ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారట. ఇక ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ తిరువీర్, గ్లామరస్ బ్యూటీ ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్నట్లు టాక్ రావడంతో ఫ్యాన్స్‌లో భారీ క్యూరియాసిటీ నెలకొంది. తన అందంతో పాటు నటనతో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్, ఏ పాత్రలోనైనా జీవించేసే తిరువీర్ కాంబినేషన్ అనగానే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పైగా ఈ సినిమా షూటింగ్ కూడా నిశ్శబ్దంగా దాదాపు పూర్తయిపోయిందని వస్తున్న వార్తలు టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ‘అది నా పిల్ల రా’ టైటిల్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.






