- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాదుల జలాలతో రైతులకు ఊరట
వర్షాభావంతో ఆందోళన చెందుతున్న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులకు దేవాదుల సాగునీటి విడుదల ఊరటనిచ్చింది.

దిశ, భీమదేవరపల్లి: వర్షాభావంతో ఆందోళన చెందుతున్న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులకు దేవాదుల సాగునీటి విడుదల ఊరటనిచ్చింది. రైతుల విజ్ఞప్తిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో దేవాదుల కాలువ నుంచి సాగునీటిని విడుదల చేశారు. దీంతో రెండు మండలాల్లోని పంట పొలాలకు సాగునీరు చేరి రైతుల్లో ఆశలు చిగురించాయి. మంత్రి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు సీఈ సుధీర్, ఎస్‌ఈ రాంప్రసాద్ పర్యవేక్షణలో నీటి విడుదల ప్రక్రియను చేపట్టారు. వర్షాలు ఆలస్యమవడంతో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు అత్యవసరంగా నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నీటితో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీటి విడుదల సందర్భంగా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పోచంపల్లి రాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, జక్కుల అనిల్, చిట్కూరి అనిల్, పోగుల శ్రీకాంత్, గజ్జి వీరయ్య, మీస మహేష్, సతీష్, సర్పంచులు, జాలి ప్రమోద్ రెడ్డి, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ చర్యలు చేపడుతోందని నాయకులు పేర్కొన్నారు. దేవాదుల జలాలు అందడంతో పంటలు ఎండిపోకుండా కాపాడే అవకాశం ఏర్పడిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి సాగునీటిని విడుదల చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం... రైతు పంటను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యం" అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.






