ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి : కలెక్టర్ బీఎం సంతోష్

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి : కలెక్టర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల ఈవీఎం గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ తనిఖీ నిర్వహించారు. గద్వాల జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తో పాటు భద్రత నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్ పాల్గొన్నారు.

Next Story