- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్
దిశ, పెద్ద కొత్త పల్లి : ఎట్టకేలకు జిల్లా అధికారులు కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాదికారి రమేష్ కుమార్ బుధవారం సాయంత్రం సస్పెండ్

దిశ, పెద్ద కొత్త పల్లి : ఎట్టకేలకు జిల్లా అధికారులు కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాదికారి రమేష్ కుమార్ బుధవారం సాయంత్రం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు పవన్ జైన్ పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం విద్యార్థినీలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అగ్రహానికి గురయ్యారు. వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్న పేరెంట్స్ సదరు కీచక ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయుల సమక్షంలో దేహశుద్ధి చేసిన విషయం పత్రికలు, మీడియాల్లో ప్రసారమయ్యాయి. దీనిపై విచారణ నిమిత్తం పెద్ద కొత్త పల్లి ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి ని గంట్రావు పల్లి పాఠశాలకు వెళ్లి రెండో రోజు విచారణ చేశారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా కీచక ఉపాధ్యాయుడు పవన్ జైన్ ను జిల్లా విద్యాదికారి రమేష్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాఠశాల కు కీచక ఉపాధ్యాయుడి పీడ విరగడ అయిందని ఆ గ్రామస్తులు, విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






