- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే సైన్స్ ఫెయిర్ : కరస్పాండెడ్ రాజేందర్ రెడ్డి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చైతన్య భారతి స్కూల్ కరస్పాండెంట్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, మిడ్జిల్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చైతన్య భారతి స్కూల్ కరస్పాండెంట్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో చైతన్య భారతి పాఠశాలలో విద్యార్థులతో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలపై సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రాజెక్ట్ లు ప్రదర్శించారు. సందర్శకులను ఈ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని.. అలాగే సృజనాత్మకత, పరిశోధన దృక్పథాన్ని అభివృద్ధి చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి ప్రిన్సిపల్ ధనంజయ రెడ్డి, సీబీ మాధ్య, కిరణ్ మై, శివకుమార్ పాల్గొన్నారు.






