అప్పుల నెపంతో పాఠశాలకు తాళం

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : బాకీల బూచి చూపి పాఠ‌శాల యాజ‌మాన్యం తాళం వేసి విద్యార్థుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేప‌డుతున్న ఘ‌ట‌న మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలో

అప్పుల నెపంతో పాఠశాలకు తాళం
X

దిశ‌, మ‌క్త‌ల్ : బాకీల బూచి చూపి పాఠ‌శాల యాజ‌మాన్యం తాళం వేసి విద్యార్థుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేప‌డుతున్న ఘ‌ట‌న మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. తన పాఠశాలను తాళం వేశారని, స్కుల్ బస్సులను ఎత్తుకెళ్లాలని.. పాఠశాల యాజమాన్యం మక్తల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. సంగంబండ రోడ్ లో ఉన్న ప్రైవేటు హై స్కూల్ పాఠశాల్లో దాదాపు 600 మంది విద్యార్థులతో కోనసాగుఉండగా.. పాఠశాల భవన యజమానికి మూడు సంవత్స రాలుగా కిరాయి ఇవ్వకుండా వేధించడం.. పాఠశాలకు వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులను చేరవేస్తున్న డ్రైవర్ల నుండి తీసుకున్న లక్షలాది రూపాయల (రుణం)బాకీలను చెల్లించకపోవడంతో బాధితులు కొంద‌రూ కలిసి బాకీలు చెల్లించాలని పలుమార్లు యజమాన్యాన్ని నిలదీశారు ఇచ్చిన గడువులో పాఠశాల యాజమానురాలు బాకీలు చెల్లించక పోవడంతో అప్పు ఇచ్చిన వారందరూ ఏకమై పాఠశాలకు ఆదివారం తాళం వేశారు. వీరిద్దరి మధ్య బాకీల చె ల్లింపులపై రాద్ధాంతం జరుగుతున్నది. హైస్కూల్ తరగతులు చదువుతున్న విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోతున్నామని, విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.

ఈ స‌మ‌స్య‌ను డీఈవో దృష్టికి తీసుకెళ్లా : ఎంఈవో అనిల్ గౌడ్

సంగం బండ రోడ్డులో ఉన్న పాఠ‌శాల గ‌త నాలుగు రోజులుగా తాళం వేసి ఉండ‌టాన్ని ఎంక్వ‌యిరీ చేశాం. పాఠ‌శాల యాజ‌మాన్యం ప‌లువురి వ‌ద్ద అప్పులు చేయ‌డం.. స‌రైన స‌మ‌యానికి చెల్లించ‌లేదు. దీంతో వారంద‌రూ క‌లిసి పాఠ‌శాల‌కు తాళం వేశారు. ఈ స్కూల్ లో దాదాపు 650 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు 150 మంది 9, 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. వారి చ‌దువుకు ఆటంకం క‌లుగుతుంద‌ని.. విద్యార్థులు విలువైన స‌మ‌యాన్ని కోల్పోయార‌ని, త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేస్తున్న‌ట్టు డీఈవో దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలిపారు. డీఈవో ఆదేశాలు వ‌చ్చాక పాఠ‌శాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం.

Next Story