- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేవ్ ఎర్రవెల్లి
మాకు ఏ దిక్కు చూపని ఎన్నికలు ఎందుకంటూ మండల పరిధిలోని ఎర్రవెల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, చారకొండ : మాకు ఏ దిక్కు చూపని ఎన్నికలు ఎందుకంటూ మండల పరిధిలోని ఎర్రవెల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోకారం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ఎర్రవెల్లి గ్రామం ముంపునకు గురవుతున్నందునా రిజర్వాయర్ నిలువ సామర్థ్యాన్ని తగ్గించి తమ గ్రామాన్ని ముంపునుండి కాపాడాలని గత కొంతకాలంగా గ్రామస్తులు అనేక రూపాలలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తమ ఆవేదనను తెలిపినా వారు ఏమాత్రం కనికరం చూపడం లేదని గ్రామస్థులు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గ్రామస్తులు సమావేశమై ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానించుకున్నట్లు వారు తెలిపారు. మా గ్రామాన్ని కాపాడుకోవడం కంటే ఎన్నికలు ముఖ్యం కాదనీ, గ్రామస్తుల తీర్మానాన్ని ఎవరు అతిక్రమించినా కన్న తల్లిలాంటి ఊరుకు ద్రోహం చేసిన వారవుతారని తెలిపారు. గతంలో ప్రజాప్రతినిధులు నీటి సామర్థ్యం తగ్గిస్తామని మమ్ముల్ని గెలిపించండని హామీలు ఇచ్చి నేడు ఈ సమస్య పట్ల కనీసం స్పందించక పోవడంతో ఈ ఎలక్షన్స్లో గ్రామస్తులం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎర్రవెల్లి గ్రామం, ఎర్రవెల్లి తాండా వాసులు సుమారు రెండు వేల మందికీ వేరే స్థలంలో పునరావాసం కల్పించినా, ఆ మాత్రం ఉన్న అర ఎకర, ఎకర భూమి కోల్పోతే ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న మాకు ఉపాధి ఎట్ల అని వారు ప్రశ్నిస్తున్నారు. రిజర్వాయల్ నీటి సామర్థ్యం పై ప్రభెత్వం తరుపున జీవో ఇచ్చేవరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వారు హెచ్చరించారు.






