- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి దాకా సాగిన నామినేషన్లు.. టోకెన్లు ఇచ్చి తెల్లవారుజాము వరకు స్వీకరణ
మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం శనివారం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది.

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ఘట్టం శనివారం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. చివరి రోజు, శుభ ఘడియలు లేవన్న నమ్మకంతో నిన్నటి వరకు ఆగి ఉన్న ఆశావాహులు సాయంత్రం 5 గంటల లోపు పెద్ద ఎత్తున నామినేషన్ల కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. నామినేషన్ల స్వీకరణ కోసం కార్యాలయంలో ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి స్వీకరణ కొనసాగించారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో నామినేషన్లు రావడంతో, వాటిని పరిశీలించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి, ధరూర్ మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రక్రియ అర్ధరాత్రి దాటి కొనసాగింది. ఈ ఆలస్యం కారణంగా, ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయనే పూర్తి వివరాలు ఆదివారం తెల్లవారుజామున ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొదటి విడత ఎన్నికల ప్రాముఖ్యతను చాటింది.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం శనివారం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. మొదటి రెండు రోజులు నామినేషన్ల దాఖలు ఘట్టం మందకొడిగా సాగింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభ ఘడియలు లేవు అన్న నమ్మకంతో ఉన్న ఆశావహులు అందరూ ఒక్కసారిగా వారి వారి నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్దకు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయాల్లో ఉన్నవారికి టోకెన్లు ఇచ్చారు.
అర్ధరాత్రి వరకు...
ఒక్కసారిగా జనం పెద్దఎత్తున రావడం, నామినేషన్ల వివరాలను పరిశీలించడం, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి రావడంతో నామినేషన్ ప్రక్రియ ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి, ధరూరు మండలాలలో రాత్రి 12 గంటల వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగింది. మిగిలిన మండలాల్లో నామినేషన్లు, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ప్రక్రియలు ఆలస్యం కావడంతో గ్రామ పంచాయతీల వారీగా ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయి అన్న వివరాలను గుర్తించి వాటిని సంబంధిత అధికారులకు పంపించలేదు. ఈ ప్రక్రియ అంతా ఆదివారం తెల్లవారుజామున దాకా కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి విడతలో ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అన్న విషయాలు నేడు పూర్తిస్థాయిలో అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.






