పేద కుటుంబానికి స‌ర్పంచ్, స్నేహితుల అండ

by Ratna Kumari |

నిరుపేద వృద్ధ దంప‌తుల‌కు కొండూరు స‌ర్పంచ్, అత‌ని స్నేహితులు ఆర్థిక స‌హాయంతో నూత‌నంగా ఇంటిని నిర్మించి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు.

పేద కుటుంబానికి స‌ర్పంచ్, స్నేహితుల అండ
X

దిశ, పెంట్లవెల్లి : నేడో, రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న మ‌ట్టి మిద్దెలో బ‌తుకులు కొన‌సాగిస్తున్న ఓ నిరుపేద వృద్ధ దంప‌తుల‌కు కొండూరు స‌ర్పంచ్, అత‌ని స్నేహితులు ఆర్థిక స‌హాయంతో నూత‌నంగా ఇంటిని నిర్మించి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. పెంట్ల‌వెల్లి మండ‌లం కొండూరు గ్రామంలో నిరుపేద కుటుంబం క‌టిక కేశ‌వులు, బాల‌బాయి దంప‌తుల‌కు స‌ర్పంచ్ ధ‌ర్మ‌తేజ‌, స్నేహితులు ఆర్థిక సాయం చేశారు. ఈ ఇంటిని ఇవాళ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు త‌న‌యుడు, కాంగ్రెస్ యువ‌జ‌న నాయ‌కులు జూప‌ల్లి అరుణ్ అట్ట‌హాసంగా ప్రారంభం చేసి గృహ ప్ర‌వేశం చేయించారు. పెంట్ల‌వెల్లి మండ‌ల ప‌రిధిలోని కొండూరు గ్రామంలో నిర్మించిన గృహానికి స‌ర్పంచ్ ధ‌ర్మ‌తేజ నేతృత్వంలో ర‌త్న‌గిరి ఫౌండేష‌న్ మేనేజింగ్ ట్ర‌స్ట్, కాంగ్రెస్ యువ‌నాయ‌కులు జూప‌ల్లి అరుణ్ పూజ‌లు నిర్వ‌హించి కేశ‌వులు కి ఇంటి తాళాలు అంద‌జేశారు.


ఈ సందర్భంగా జూపల్లి అరుణ్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన ఉపాధ్యాయుడు కృష్ణప్రసాద్, సాక్షి టీవీ జర్నలిస్ట్ రాజేందర్ గౌడ్, టాస్క్ ట్రైనర్ వెంకటేష్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పెబ్బేటి గిరిబాబు, టీచర్ క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులు ముందుకువచ్చి ఇంటిని నిర్మించి వృద్ధాప్యంలో కటిక కేశవులు దంపతులకు అండగా నిలవడం హర్షించదగ్గ పరిణామన్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి వారు ముందుకు వచ్చి పేదవారికి తమకు తోచిన విధంగా సహాయమందించే దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లపోతుల గోపాల్, గ్రామ పెద్దలు పెద్ద కృష్ణారావు, గ్రామ ఉప సర్పంచ్ వడ్డే మాన్ రాముడు, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, వార్డు మెంబర్లు దొబ్బలి వెంకటయ్య, కావలి ఈశ్వరయ్య, గుందిమళ్ళ సుధాకర్ రెడ్డి నరేష్, నాయకులు రెడ్డీ వెంకటేశ్వర్లు, ఖలీల్, డీలర్ కురుమయ్య పాల్గొన్నారు.

Next Story