డీసీసీ అధ్యక్షుడుగా నియామక పత్రం అందుకున్న సంజీవ్ ముదిరాజ్

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియమితులైన సంజీవ్ ముదిరాజ్ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు

డీసీసీ అధ్యక్షుడుగా నియామక పత్రం అందుకున్న సంజీవ్ ముదిరాజ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియమితులైన సంజీవ్ ముదిరాజ్ అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన టిపిసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆయన ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, పార్టీ నాపై నమ్మకంతో ఎంతో బాధ్యతగా అధ్యక్షుడి పదవి అప్పగించిందని, అందరి సహకారంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన అన్నారు. ఆయన వెంట టిపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి ఉన్నారు.

Next Story