- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడేరు లో ముమ్మరంగా పారిశుధ్యం, అభివృద్ధి పనులు
దిశ, కోడేరు/కొల్లాపూర్ : కోడేరు మండల కేంద్రంలో గత రెండేళ్లుగా సమస్యలు తాండవిస్తున్నాయి.

దిశ, కోడేరు/కొల్లాపూర్ : కోడేరు మండల కేంద్రంలో గత రెండేళ్లుగా సమస్యలు తాండవిస్తున్నాయి. ఎక్కడి సమస్యలు అక్కడ తిష్ట వేయడం తో అధికారులు, నాయకులకు ప్రజలు చెప్పుకోలేని దుస్థితి తలెత్తింది. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్యం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామాభివృద్ధి కోసం పరితపించే కృషి, పట్టుదల, అంకితభావం కలిగిన సమర్థుడిని ప్రజలు సర్పంచ్ గా నడింపల్లి మహేశ్వర్ రెడ్డి గెలిపించు కోవడంతో గత వారం రోజులుగా నిరంతరం వివిధ అభివృద్ధి పనులను ముమ్మరంగా చెపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి కోడేరు లో అన్నీ వార్డుల్లో కలియ తిరిగారు. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి తన పర్యవేక్షణ లో ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు.
గ్రామంలోని గురుకుల రెసిడెన్సీ పాఠశాలలో బాలికల చేసే స్నానాల మురికి నీరు బయటకు వేళ్ళక అక్కడే నిలిచిపోవడం తో దుర్గందం వ్యాపిస్తుంది. దీంతో మంగళవారం జేసీబీ తో కాలువ తీయించి పాఠశాల నుంచి మురికి నీరు పైప్ లైన్ ద్వారా మురికి కాలువకు కలిపారు.అలాగే వడ్ల గేరి, కుమ్మరి గేరి, వడ్డెరగేరి ల్లో ప్రజలకు తాగునీటికీ ఇబ్బందులుపడుతూ వచ్చారు. ఆయా ఏరియాలో సీసీ రోడ్లను పగులగొట్టి తాగు నీటి కోసం పైప్ లైన్ విస్తరణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. గ్రామం లో పేర్కుపోయిన సమస్యలను వేగవంతంగా సర్పంచ్ చేపడుతుండడం తో ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నారు.అలాగే మరో పక్క ఏడో వార్డు లో ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను జేసీబీ తో తొలగింపు పనులు సైతం జరుగుతున్నాయి.ఈ పనులను సర్పంచ్ తోపాటు ఉప సర్పంచ్ మాసయ్య, వార్డు సభ్యులు శరత్, రామకృష్ణ, గ్రామ నాయకులు ఉన్నారు.






