ఇసుక ట్రాక్టర్ పట్టివేత‌.. కేసు నమోదు

by Ratna Kumari |

మండల పరిధిలో ని డిండి- చింతపల్లి గ్రామ శివారులో దుందుభి వాగు నుంచి గురువారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను బ్లూ కోర్ట్ సిబ్బంది పట్టుకుని పోలీస్ స్టేషన్ కు త‌ర‌లించారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత‌.. కేసు నమోదు
X

దిశ, వంగూర్ : మండల పరిధిలో ని డిండి- చింతపల్లి గ్రామ శివారులో దుందుభి వాగు నుంచి గురువారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను బ్లూ కోర్ట్ సిబ్బంది పట్టుకుని పోలీస్ స్టేషన్ కు త‌ర‌లించారు. అయితే TG 31T0014 నెంబర్ గల ట్రాక్టర్ చింతపల్లి ట్రాక్టర్ డ్రైవర్ నీరటి రమేష్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ గౌడ్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తవ్వడం లేదా రవాణా చేస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Next Story