- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైసెన్స్ లేని మందుల విక్రయం.. ఐదేళ్ల జైలు, ₹1.20 లక్షల జరిమానా
దిశ, గద్వాల క్రైమ్ : లైసెన్స్ లేకుండా మందులను విక్రయించిన కేసులో నిందితుడికి జోగులాంబ గద్వాల జిల్లా న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. జిల్లా జడ్జి గౌరవనీయులు ఎన్. ప్రేమలత శుక్రవారం

దిశ, గద్వాల క్రైమ్ : లైసెన్స్ లేకుండా మందులను విక్రయించిన కేసులో నిందితుడికి జోగులాంబ గద్వాల జిల్లా న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. జిల్లా జడ్జి గౌరవనీయులు ఎన్. ప్రేమలత శుక్రవారం తుది తీర్పు వెలువరిస్తూ.. నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,20,000 జరిమానా విధించారు.
నిర్మలా క్లినిక్ యజమానిపై కేసు
జిల్లాలోని జమ్మిచేడు గ్రామంలో 'నిర్మలా క్లినిక్' నిర్వహిస్తున్న జయరాముడు అనే వ్యక్తి లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తూ పట్టుబడ్డాడు.
తనిఖీలో పట్టుబడ్డ నిందితుడు
ఈ ఘటన 2015, ఆగస్టు 6వ తేదీన జరిగింది. డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ హరిత హోటల్ సమీపంలో తనిఖీ నిర్వహిస్తుండగా, జయరాముడు సైకిల్ మోటార్‌పై కార్టన్‌లో 35 రకాల మందులను తరలిస్తూ పట్టుబడ్డాడు. మందులకు సంబంధించిన ఇన్‌వాయిస్ చూపించమని అడగగా, అతనికి లైసెన్స్ లేదని నిందితుడు అంగీకరించాడు. అప్పటి గద్వాల రూరల్ ఎస్‌ఐ ఆంజాద్ అలీ పంచుల సమక్షంలో పంచనామా చేసి, జయరాముడుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం, ప్రాసిక్యూషన్ వాదనలు వాస్తవం అని నిర్ధారించింది. దీని ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద కింది విధంగా శిక్ష ఖరారు చేసింది.
- సెక్షన్ 27 ప్రకారం : 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1,00,000 జరిమానా.
- సెక్షన్ 28 ప్రకారం: అదనంగా 6 నెలల జైలు శిక్ష మరియు ₹20,000 జరిమానా.
- మొత్తం 5 సంవత్సరాల 6 నెలల జైలు శిక్షతో పాటు ₹1,20,000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ఎన్. ప్రేమలత తుది తీర్పు వెలువరించారు.
ఈ కేసులో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. వినోదా చారి ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్ మరియు ఎస్‌ఐ ఆంజాద్ అలీ తగు సాక్ష్యాలను సమర్పించి దోషికి శిక్ష పడేలా కృషి చేశారు.






