- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
మధ్యాహ్నం వేళలో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురు పలువురు గాయపడ్డారు.

దిశ, అడ్డాకుల, మూసాపేట : మధ్యాహ్నం వేళలో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. పలువురు పలువురు గాయపడ్డారు. మూసాపేట ఎస్సై వేణు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ నుంచి తిరుపతికి వెళుతున్న మహబూబ్ నగర్ డిపో కి చెందిన TS06 Z 0260 ఆర్టీసీ లగ్జరీ బస్సు మూసాపేట మండలం కొమ్మిరెడ్డిపల్లి దగ్గర అదుపుతప్పి డివైడర్ ఎక్కి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. మృతుల్లో కొత్తకోట మండలం వడ్డేవాటకు చెందిన లారీ డ్రైవర్ (45), కొత్తకోటకు చెందిన హమాలీ కూలి నాగన్న (50), బస్సు డ్రైవర్ పురుషోత్తం(58) ఉన్నారు. జాతీయ రహదారి పై ట్రాఫిక్ జామ్ కావడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ బృందంతో ఎస్సై వేణు ఘటన స్థలానికి చేరుకొని క్లియర్ చేయించారు.






