- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట ఆరబెట్టిన చోట ఆగిన యువకుడి ప్రాణం
ఏదుల శివారులోని పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్ బ్రిడ్జిపై ఆరబోసి మొక్కజొన్న రాశికి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందగా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

దిశ, రేవల్లి : ఏదుల శివారులోని పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్ బ్రిడ్జిపై ఆరబోసి మొక్కజొన్న రాశికి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో యువకుడు ప్రమాదానికి గురై మృతి చెందగా ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సంఘంటనకు సంబంధించి గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఏదుల మండల పరిధిలోని అనంతపురం గ్రామానికిచెందిన నరసింహా రోడ్డుకు అడ్డంగా నిర్లక్ష్యంగా కుప్ప పోసి దానిపై నల్లని కవర్ కప్పాడు. చీకట్లో అది కనిపించకపోవడంతో మృతుడు కృష్ణ దానిపైకి వెళ్లి అదుపుతప్పి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు కృష్ణ. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిర్లక్ష్యంగా రోడ్డుకు అడ్డంగా మొక్కజొన్న పోసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై జగన్ మోహన్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పంటలను రహదారులపై ఆరబెట్టడం కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు అది ప్రాణాలను బలిగొంటున్న ప్రమాదకర అలవాటుగా మారుతోంది. రాత్రి వేళల్లో వాహనదారులకు కనిపించని విధంగా ధాన్యపు రాశులు వేయడం, వాటిపై నల్ల కవర్ లు కప్పడం మరింత ప్రమాదం, ఒక్కరి పంట కోసం ఇంకొకరి ప్రాణం పోవాలా?” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై ధాన్యపు రాశులు వేయవద్దని ఇవి ప్రమాదాలకు నిలయాలవుతాయని, చట్టరీత్యా నేరమని అధికారులు చెబుతున్నా రైతులు, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పంటను కాపాడే క్రమంలో ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తోంది. ఈ విషయమై గోపాల్ పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు.






