మరికల్-దేవరకద్ర రహదారిపై రోడ్డు ప్ర‌మాదం

by velandi.Saikiran |

మరికల్-దేవరకద్ర ప్రధాన రహదారిపై శుక్రవారం పెద్దచింతకుంట స్టేజి సమీపం దగ్గర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

మరికల్-దేవరకద్ర రహదారిపై రోడ్డు ప్ర‌మాదం
X

దిశ, మరికల్ : మరికల్-దేవరకద్ర ప్రధాన రహదారిపై శుక్రవారం పెద్దచింతకుంట స్టేజి సమీపం దగ్గర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరికల్ ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం చిన్నచింతకుంట మండలం ఫర్దిపూర్ గ్రామానికి చెందిన కురుమూర్తి (27) మరికల్ నుంచి తన గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కురుమూర్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని అంబులెన్స్ లో మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

Next Story