- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ ఫలితాల్లో తిరుగులేని 'రిషి' జూనియర్ కళాశాల
రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం విడుదలైన ఫలితాలలో మరోసారి విజయ దుందుభి మోగించారు.

దిశ, పాలమూరు : రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఆదివారం విడుదలైన ఫలితాలలో మరోసారి విజయ దుందుభి మోగించారు. బైపిసి, ఎంపీసీ విభాగాలలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు.. రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో యు. వినయ్ కుమార్ గౌడ్ 470 మార్కులకు 468 మార్కులు సాధించి చరిత్ర సృష్టించాడు. వేణుమాధవ్ రెడ్డి,జి. అంకిత్, జి. మాధురి, ఎ. కార్తీక్ రెడ్డి, సృజన విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు. బైపీసీ మొదటి సంవత్సరం లో కె. అక్షిత, తానియా మహమూద్ 440 మార్పులకు 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. శ్రావణి, భవిత, సౌమ్య, సురేంద్ర చక్రవర్తి, అక్షిత, ఆయేషా జువా, అఖిల ,అశ్లేష యాదవ్, మౌనిక, రిషిత, నాగ సాయి వైష్ణవి, మైవిన్, కె. మీనాక్షి సహా 14 మంది విద్యార్థులు 437 టాప్ మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు
ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఎం. భావన 1000 మార్కులకు గాను 995 మార్కులు సాధించింది. మొహమ్మద్ అశ్వాక్ అహ్మద్, సయ్యద్ మిస్బావుద్దిన్, శ్రీవిద్య 992 మార్కులు సాధించగా, కోటేశ్వర్ 990 మార్కులు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో అఫ్సా మోయిన్, పి. గాయత్రి , అమూల్య ఈ ముగ్గురు విద్యార్థులు 1000 మార్కులకు 994 మార్కులతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఫారియా, ఫాతిమా కదీర్ 993 మార్కులు సాధించగా.. నందిని రెడ్డి, వైశాలి 992 మార్కులు, శ్రీనిధి 991, సృజన 990, సుమేరా బేగం 990 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్‌పర్సన్ చంద్రకళ వెంకట్, డైరెక్టర్ వెంకటయ్య , డీన్ భూపాల్ రెడ్డి, అకాడమిక్ డీన్ కళ్యాణ్ బాబు, ప్రిన్సిపాల్స్ రాఘవేంద్రరావు, వెంకటరత్నం, ప్రసన్నకుమారి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులకు అభినందనలు
అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాలడైరెక్టర్ వెంకటయ్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.






