రేవంత్ రెడ్డి ప్రో యాక్టివ్ ముఖ్య‌మంత్రి : MP మల్లు రవి

by Ratna Kumari |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల ముంద‌స్తు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్రో యాక్టివ్ ముఖ్యమంత్రి గా ప్రజాపాలన ప్రభుత్వంలో నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రో యాక్టివ్ ముఖ్య‌మంత్రి : MP మల్లు రవి
X

దిశ, తెలకపల్లి : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల ముంద‌స్తు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్రో యాక్టివ్ ముఖ్యమంత్రి గా ప్రజాపాలన ప్రభుత్వంలో నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. గురువారం మండల పరిధిలోని రామ్ రెడ్డి పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 200 ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించినట్లు వారు తెలిపారు. గత బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజా సమస్యలను గాలికొదిలి, ప్రజాస్వామ్యాన్ని విస్మరించి పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేసుకోవడమే చేసిందని విమర్శించారు. ప్రజా పాలన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు మొదలగు ఎన్నో పథకాలను అందించామని తెలిపారు. పది సంవత్సరాలలో 100 సంవత్సరాలకు సరిపడే అభివృద్ధిని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేస్తుందని అన్నారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాదును మినీ ఇండియాగా తీర్చిదిద్దడం కోసం మూసినది సుందరీ కరణ పనులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దక్షిణ తెలంగాణలో రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్నానని ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తెలకపల్లి సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story