నామినేష‌న్ల షెడ్యూల్ విడుద‌ల చేయ‌ని రేవ‌ల్లి ఎంపీడీవో కార్యాల‌యం

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలవ్వ‌గా ఉత్సాహవంతులు పోటీ దారులతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. అయితే రేవల్లి మండల పరిషత్ కార్యాలయ

నామినేష‌న్ల షెడ్యూల్ విడుద‌ల చేయ‌ని రేవ‌ల్లి ఎంపీడీవో కార్యాల‌యం
X

దిశ‌, రేవ‌ల్లి : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలవ్వ‌గా ఉత్సాహవంతులు పోటీ దారులతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. అయితే రేవల్లి మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మొద్దు నిద్రను వీడడం లేదు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో రిజర్వేషన్ వివరాలను ప్రకటించగా.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 విడతలుగా ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది. దీంతో గ్రామాల్లోని సర్పంచులు వార్డు మెంబర్లు నామినేషన్ల నమోదు కేంద్రాల వివరాలు వాటి షెడ్యూలు కార్యాలయాలు చిరునామాలు పత్రికలు సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తుంటారు. బుధవారం రాత్రి వరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయ వర్గాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్థానిక పత్రికా ప్రతినిధులను సంప్రదించిన సమాచారం లభ్యం కాకపోవడంతో ఎన్నికల సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఎన్నికల నియమావలి సజావుగా అమలావుతుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

బుధవారం నుంచి ఏదుల మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నామినేషన్ పర్వం ప్రారంభించనున్నట్లు ఎంపీడీవో రఘురాములు ఓ ప్రకటనలో తెలిపారు. ఏదుల గ్రామపంచాయతీ కార్యాలయంలో అనంతపూర్, ఏదుల, చెన్నారం, చీర్కపల్లి, గొల్లపల్లి గ్రామాల నామినేషన్లు చెన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో.. మాచుపల్లి, గుండ్ల వాళ్య నాయక్ తాండ నామినేషన్ లు మాచుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో, సింగాయిపల్లి, ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, రేకులపల్లితాండ నామినేషన్లు సింగయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఈనెల29 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే నామినేష‌న్ల‌ను పరిశీలించిన తుదిజాబితాను 30న ప్రకటించనున్నట్లు, అభ్యంతరాలు అప్పీల్లు డిసెంబ‌ర్ 1న తీసుకొని 2న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరిష్కరించనున్నట్లు, నామినేషన్ల ఉపసంహారణ డిసంబర్ 3వ తేదీ మ‌ధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణ తర్వాత తుదిజాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. డిసెంబ‌ర్ 11న స‌ర్పంచ్ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. స‌ర్పంచ్ అభ్య‌ర్థికి రూ.2వేలు, వార్డు మెంబ‌ర్ కి రూ.500 డిపాజిట్ చెల్లించాల‌ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించాల‌ని.. లేని యెడ‌ల డిప్యూటీ త‌హ‌శీల్దార్ ధృవీక‌రించాల‌ని, 18 సంవ‌త్స‌రాలు నిండిన ఆ గ్రామంలో ఓట‌ర్ గా న‌మోదైన వారు అర్హుడు.

Next Story