- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలి
దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Gratuity, Pension, Leave Encashment, GPF, GIS ) తక్షణమే విడుదల చేయాలని TSCPSEU

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Gratuity, Pension, Leave Encashment, GPF, GIS ) తక్షణమే విడుదల చేయాలని TSCPSEU జిల్లా అధ్యక్షుడు K.M. చంద్రకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గండీడ్ మండలం కొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రావాల్సిన రిటైర్మెంట్ బకాయిల్లో రూ.9 లక్షలు ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేసి ఆయన ఖాతాలో జమ చేయడం హర్షణీయమని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ రిటైర్మెంట్ లాభాలు సమయానికి అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు రిటైర్మెంటై రెండేళ్లు దాటినా ఇంకా తమకు రావలసిన బెనిఫిట్స్ రాక ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. “రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవితం గడపాల్సిన ఉద్యోగులు ఆసుపత్రి ఖర్చులకు అప్పులు చేస్తూ, ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ “ఉద్యోగులు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో అంకితం చేసిన తర్వాత హక్కుగా దక్కాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం హృదయ విదారక విషయం. కొందరు రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర నిరాశలో మృతి చెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి” అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు ఇనాయత్, శాంసన్, భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, రాఘవేందర్ రావు, విజయ్ పాల్గొన్నారు.






