- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దిశ' కథనానికి స్పందన.. పులి జాడ కోసం అన్వేషణ
'కొత్త యాపట్ల అడవిలో పులి సంచారం.."కుక్కలు వెంబడించడంతో మేకను వదిలేసిన పులి అనే శీర్షికన సోమవారం 'దిశ' పత్రికలో ప్రచురితమైన కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు.

దిశ, పెద్దకొత్తపల్లి : 'కొత్త యాపట్ల అడవిలో పులి సంచారం.."కుక్కలు వెంబడించడంతో మేకను వదిలేసిన పులి అనే శీర్షికన సోమవారం 'దిశ' పత్రికలో ప్రచురితమైన కథనానికి అటవీ శాఖ అధికారులు స్పందించారు. లింగాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అంబటిపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో పలువురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సోమవారం పెద్దకొత్తపల్లి మండల పరిధిలోనీ కొత్త యాపట్ల అడవిలోని శివునితిప్ప ప్రదేశంలో పులి జాడల కోసం అన్వేషణ చేశారు. కొత్త యాపట్ల కు చెందిన గొల్ల శివుడు తన మేకలను మేత కోసం సమీపంలోని శివునితిప్ప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆదివారం రాత్రి మేకలను తిరిగి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో పులి ఆకస్మాత్తుగా దాడి చేసి ఓ మేకను ఎత్తుకెళ్లింది. మేకల మందలో ఉన్న కుక్కలు పులి అలికిడి విని వెంబడించడంతో మేకను కొద్ది దూరంలో వదిలేసిందని మేకల కాపరి గొల్ల శివుడు చెప్పిన విషయం తెలిసిందే. 'దిశ' కథనంతో అటవీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి శివునితిప్ప అటవీ ప్రాంతంలో పులి జాడల కోసం అన్వేషణ చేసినప్పటికీ దాని జాడలు కనిపించలేదని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వెంకటేష్ తెలిపారు. మేకలు, గొర్రెలను సమీపంలోని అడవుల్లోకి మేతలకు కాపర్లు తీసుకెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.






