దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. విచారణ కొనసాగిస్తున్న అడిషనల్ ఎస్పీ శంక‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల ప్రతినిధి : వసూళ్ల పర్వం లో సీఐ పాత్ర? దిశ కథనం పై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు జిల్లా ఎస్పీ టి శ్రీనివాస్ రావు, జిల్లా అదనపు ఎస్పీ కే శంకర్ కు ఆదేశించినట్టు స‌మాచారం.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. విచారణ కొనసాగిస్తున్న అడిషనల్ ఎస్పీ శంక‌ర్
X

దిశ, గద్వాల ప్రతినిధి : వసూళ్ల పర్వం లో సీఐ పాత్ర? దిశ కథనం పై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఎస్పీ టి శ్రీనివాస్ రావు, జిల్లా అదనపు ఎస్పీ కే శంకర్ కు ఆదేశించినట్టు స‌మాచారం. ఈ విషయం పై జిల్లా అదనపు ఎస్పీ కే శంకర్ ని వివరణ కోరగా.. ఎస్పీ ఆదేశాల మేరకు గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ పై డిపార్ట్మెంటల్ అంతర్గత విచారణ చేపడుతున్నామని పాగుంట జాతర లో వసూలు చేసారని వస్తున్నా అభియోగాల పై నిష్పాక్షపాతంగా విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందని ఆయన దిశ కు తెలిపారు. అవినీతికి ఎవరు పాల్పడిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ శంకర్ తెలిపారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రికేత్తిన డిసెంబర్ లో జరిగిన గద్వాల కు చెందిన సర్వేయర్ తెజేశ్వర్ హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు బ్యాంకు మేనేజర్ తిరుమల రావు తో కూడా భారీగా వసూళ్లు చేసారని ఆరోపణలు వ‌చ్చాయి. ఇదే విషయం పై అదనపు ఎస్పీ శంకర్ ను వివరణ కోరగా హత్య జరిగిన సమయం లో తాను భాద్యత లో లేనని, ఈ మధ్యనే జిల్లా కు రావడం జరిగిందని తెలిపారు. అలాంటి ఆరోపణ పై ఎవరైనా స్పందించి వివరాలు అందజేస్తే వాటిపై కూడ విచారణ చేప‌డుతామ‌ని అదనపు ఎస్పీ శంకర్ దిశ కు తెలిపారు.

Next Story