- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. 22 గంటల్లో షెడ్ ఏర్పాటు
చిరిగిన టెంట్ క్రింద ఐదు రూపాయల భోజనం సరఫరా చేస్తుండడంతో భోజనం చేసేందుకు వచ్చే బీదలు ఎండకు పడుతున్న ఇబ్బందులను గురించి ఈనెల 23న ప్రచురించిన కథనం సమస్య పరిష్కారానికి మార్గం చూపింది.

దిశ, మహబూబ్ నగర్ : చిరిగిన టెంట్ క్రింద ఐదు రూపాయల భోజనం సరఫరా చేస్తుండడంతో భోజనం చేసేందుకు వచ్చే బీదలు ఎండకు పడుతున్న ఇబ్బందులను గురించి ఈనెల 23న ప్రచురించిన కథనం సమస్య పరిష్కారానికి మార్గం చూపింది. దిశ లో వచ్చిన కథనంతో ఐదు భోజనం సరఫరా చేసే స్థలం వద్ద ఉన్న దయానీయ పరిస్థితులను మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి వేర్వేరుగా వెళ్లి పరిశీలించారు. 24 గంటలలో కొత్త టెంట్ వెయ్యకుంటే తమ నాయకులు కార్యకర్తలు వేస్తారు అని మాజీ మంత్రి ప్రకటించగా.. మెరుగై వసతులను కల్పించి పేదలకు ఇబ్బందులు లేకుండా ఐదు రూపాయల భోజనం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ మారేపల్లి సురేందర్ రెడ్డి ప్రకటించారు.
ఆమె ఇచ్చినట్లుగానే భోజనం చేసే స్థలంలో టెంట్లు కాకుండా రేకులతో షెడ్ వేయించారు. కేవలం 22 గంటలలో పనులను పూర్తి చేయించారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మమతా శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , డిసిసి కార్యదర్శి సిరాజ్ కాద్రి తో కలిసి ఎమ్మెస్సార్ షెడ్ ను గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మున్నూరు రవి, మైత్రి యాదయ్య, రాములు, డివిజన్ల కార్పొరేటర్లు మోసిన్, ప్రవీణ్ కుమార్, కిషన్ నాయక్, రమేష్ రెడ్డి, పెద్ద గొల్ల, సందీప్, గూడెం అంజనేయులు, సంజీవ్ పాల్గొని భోజనాలు చేశారు.






