"దిశ" కథనానికి స్పందన.. అద‌న‌పు బెడ్ల ఏర్పాటుకు వారం రోజుల్లో చ‌ర్య‌లు

by Ratna Kumari |

దిశ, కందనూల్ : "అరకొరగా వెంటిలేటర్ బెడ్స్ష‌ శీర్షికన దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ దవాఖాన

దిశ కథనానికి స్పందన.. అద‌న‌పు బెడ్ల ఏర్పాటుకు వారం రోజుల్లో చ‌ర్య‌లు
X

దిశ, కందనూల్ : "అరకొరగా వెంటిలేటర్ బెడ్స్ష‌ శీర్షికన దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ దవాఖాన ఇన్ చార్జీ సూపరింటెండెంట్ వి.శేఖర్ స్పందించారు. నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో సరిపడ బెడ్స్ లేక వైద్యులు రోగులను బయటకి పంపుతున్నఅంశంపై "దిశ" దిన పత్రికకు వివరణ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే పేషేంట్లను బయటకు పంపించకుండా అవసరమున్న వారందరికి తగు వైద్య చికిత్సలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేషేంట్ల రద్దీని బట్టి జనరల్ ఆసుపత్రిలో అదనపు బెడ్లు ఏర్పాటు చేసేందుకు వారం రోజుల్లోగా చర్యలు ప్రారంభిస్తామన్నారు. త్వరలో అదనంగా 10 దాకా వెంటిలేటర్ బెడ్లు ఏర్పాటయ్యే అవకాశముందన్నారు. ఐసీయూకు అదనపు బెండ్లు ఏర్పాటు చేయడంతో పాటు, వేర్వేరు చోట ఉన్న ల్యాబ్ విభాగాలు కూడా ఒకే చోట ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలో సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి, సమస్యలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, రోగులకు ఇంకా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

Next Story