రేపు సాయంత్రానికి చైర్మన్ లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు.. ఆశావాహులలో ఉత్కంఠ

by Ajay Maddhiboyina |

రిజర్వేషన్ల సంఖ్యను తేల్చిన అధికారులు శుక్రవారం సాయంత్రం లోపు మున్సిపాలిటీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రేపు సాయంత్రానికి చైర్మన్ లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు.. ఆశావాహులలో ఉత్కంఠ
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రిజర్వేషన్ల సంఖ్యను తేల్చిన అధికారులు శుక్రవారం సాయంత్రం లోపు మున్సిపాలిటీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మునిసిపాలిటీలు, వార్డులకు 2011 వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం అధికారులు రిజర్వేషన్ల సంఖ్యను బుధవారం ప్రకటించిన సంగతి విధితమే.. ఆ సంఖ్యలకు అనుగుణంగా జిల్లాల స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో వార్డుల కౌన్సిలర్ ల రిజర్వేషన్లను, రాష్ట్రస్థాయి అధికారుల ఆధ్వర్యంలో చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఆశావాహులలో ఉత్కంఠ : మునిసిపాలిటీల చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేయాలి అన్న ఆశతో ఉన్న ఆశావాహులలో ఉత్కంఠ నెలకొంటుంది. మునిసిపాలిటీల వారీగా రిజర్వేషన్ల సంఖ్య వెల్లడి కావడంతో మున్సిపాలిటీలు,ఏ ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందో అన్న చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆశావాహులంతా వారి వారి అనుచర వర్గాలతో చర్చలు జరుపుకుంటున్నారు.

Next Story