పురపాలిక ఎన్నికల మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు : కలెక్టర్ బీఎం సంతోష్ పురపాలిక ఎన్నికల మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు

by Ratna Kumari |

పురపాలిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు నిబంధనల ప్రకారం మహిళ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.

పురపాలిక ఎన్నికల మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు :  కలెక్టర్ బీఎం సంతోష్    పురపాలిక ఎన్నికల మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : పురపాలిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు నిబంధనల ప్రకారం మహిళ రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో డిప్ ద్వారా గద్వాల, ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన మహిళ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల్లో మహిళలకు కేటాయించాల్సిన 50% రిజర్వేషన్లను డిప్ విధానంలో ఖరారు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story