పంచాయ‌తీ వ‌ర్క‌ర్స్ వేత‌నాలు విడుద‌ల చేయాలి : PDSU జిల్లా అధ్యక్షుడు

by Ratna Kumari |

దిశ‌, అయిజ : గ్రామపంచాయతీ వర్కర్స్ కి సంబంధించిన దాదాపు 3 నెల‌ల పెండింగ్ వేత‌నాల‌ను విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ప్ర‌గ‌తిశీల గ్రామ పంచాయ‌తీ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్

పంచాయ‌తీ వ‌ర్క‌ర్స్ వేత‌నాలు విడుద‌ల చేయాలి : PDSU జిల్లా అధ్యక్షుడు
X

దిశ‌, అయిజ : గ్రామపంచాయతీ వర్కర్స్ కి సంబంధించిన దాదాపు 3 నెల‌ల పెండింగ్ వేత‌నాల‌ను విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ప్ర‌గ‌తిశీల గ్రామ పంచాయ‌తీ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో అయిజ ఎంపీడీవో భాస్క‌ర్ కి విన‌తి పత్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు హ‌రీశ్ మాట్లాడుతూ గ్రామ పంచాయ‌తీ వ‌ర్క‌ర్ల‌కు దాదాపు 3 నెల‌ల నుంచి వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌న్నారు. పండుగ వేళ ప్ర‌భుత్వ అధికారులు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటే.. కార్మికుల కుటుంబాలు మాత్రం ప‌స్తులుండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ ప్ర‌తీనెల 5వ తేదీ లోపు వేత‌నాలు చెల్లిస్తామ‌ని చెప్పారు. కానీ మూడు నెల‌ల నుంచి కార్మికుల‌కు వేత‌నాలు అంద‌డం లేద‌ని.. వారి కుటుంబాలు ఎలా గ‌డ‌వాల‌ని ప్ర‌శ్నించారు. అప‌రిశుభ్ర‌త‌తో కూడిన మురికి ప‌నిని త‌మ సొంత పనిగా భావించి శుభ్రం చేస్తే.. వారికి క‌నీస వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌ల్టీ ప‌ర్ప‌స్ విధానాన్ని ర‌ద్దు చేసి కార్మికుల‌కు కావాల్సిన షూ, గ్లౌజులు వంటి ప‌నిముట్లు ఇవ్వాల‌ని.. అలాగే వారి ఖాతాల్లో పెండింగ్ వేత‌నాలు జ‌మ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ సోమశేఖర్, చినరాజు, ఆంజనేయులు, తిప్పన, రాముడు, ఏసన్న, రవి పాల్గొన్నారు.

Next Story