విలేక‌రీ ఔదార్యం.. త‌ప్పిన ప్రాణాపాయం

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : గుంత‌ను త‌ప్పించ‌బోయి బైకు అదుపు త‌ప్పి ఓ వ్య‌క్తి తలకు తీవ్ర గాయమైంది.

విలేక‌రీ ఔదార్యం.. త‌ప్పిన ప్రాణాపాయం
X

దిశ‌, మ‌క్త‌ల్ : గుంత‌ను త‌ప్పించ‌బోయి బైకు అదుపు త‌ప్పి ఓ వ్య‌క్తి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అటుగా వెళ్తున్న ఓవిలేక‌రీ స్పందించి వెంట‌నే 108 కాల్ చేసి అంబులెన్స్ ని పిలిపించాడు. వెంట‌నే అత‌డిని మ‌క్త‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప్ర‌థ‌మ చికిత్స అందించారు. వెంట‌నే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రాణ పాయ స్థితి నుంచి బ‌య‌ట ప‌డిన ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం మ‌క్త‌ల్ కాట‌న్ మిల్లు స‌మీపంలో చోటు చేసుకుంది. ఊట్కూర్ మండ‌లం తిప్రాస్ ప‌ల్లికి చెందిన సుభాష్ మోటార్ సైకిల్ పై మ‌క్తల్ వ‌స్తుండ‌గా.. కాట‌న్ మిల్లు ద‌గ్గ‌ర రోడ్డు పై ఉన్న గుంత‌ను త‌ప్పించ‌బోయి అదుపు త‌ప్పి కింద ప‌డ్డాడు. దీంతో త‌ల‌కు గాయ‌మైంది. స్పృహ కోల్పోయాడు. ఇది గ‌మ‌నించిన విలేక‌రీ బాల‌రాజ్ 108 కి కాల్ చేశాడు.

Next Story