- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొట్లగడ్డ తండా ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం
బొట్లగడ్డ తండా ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని బొట్లగడ్డ తండా ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి (MEO) రాజు నాయక్, ఎంఎన్ఓ సురేందర్ రెడ్డి హాజరై పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పలు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ రాంచందర్, గ్రామ సెక్రటరీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






