'కుల గణన' రెమ్యునరేషన్ చెల్లించాలి

by Ratna Kumari |

తెలంగాణ ప్రభుత్వం 2024 లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కు సంబంధించిన రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కెఎం.చంద్రకాంత్ విజ్ఞప్తి చేశారు.

కుల గణన రెమ్యునరేషన్ చెల్లించాలి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం 2024 లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కు సంబంధించిన రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కెఎం.చంద్రకాంత్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయేంద్ర బోయి కలిసి ఆయన వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. గత 2024 లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 1961మంది ఎనుమరేటర్లు,192 మంది సూపర్వైజర్లు పాల్గొన్నారని, ఇందుకు సంబంధించిన దాదాపు 2 కోట్ల 20 లక్షల రెమ్యూనరేషన్ ఇప్పటివరకు చెల్లించలేదని, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చెల్లించేలా చొరవ తీసుకోవాలని ఇది రెండో సారి విజ్ఞప్తి చేసిన్నట్లు తెలిపారు. అందుకు కలెక్టర్ స్పందించి చెల్లింపుకై ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లానని అక్కడి నుంచి రాగానే చెల్లింపు యత్నిస్తానని తెలిపినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.

Next Story